శరవేగంగా pspk27 చిత్రం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

Tuesday, February 23rd, 2021, 04:30:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. అటు అయ్యప్పణం కొషియం రీమేక్ చిత్రం లో నటిస్తూనే, ఇటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న pspk 27 చిత్రం లో కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే సినిమా సెట్స్ లో చిత్రీకరణ సమయం లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రానికి విరూపాక్ష, లేఖ హరిహర వీరమల్లు అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో అత్యంత కీలక సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాక పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం చిత్ర రీమేక్ లో నటిస్తూనే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తున్నారు. అయితే దీని తో పాటుగా పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక చిత్రం లో నటించనున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నుండి పవన్ కళ్యాణ్ సినిమా లకు దూరంగా ఉన్నారు. అయితే మళ్ళీ సినిమా ల ద్వారా ప్రేక్షకులకు దగ్గర కానున్నారు పవన్.