వైరల్ అవుతున్న పవన్ “వకీల్ సాబ్” లీక్డ్ పిక్… నల్ల కోటుతో అద్దరగొట్టేశాడు!

Monday, June 29th, 2020, 03:55:12 PM IST

అసలే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలంతా లాక్ డౌన్ లో తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సినిమాలు లేవు, ఇంకా ధియేటర్స్ ఓపెన్ కాలేదు. మరో పక్క పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుంది. వకీల్ సాబ్ అంటూ మొదలు పెట్టినా విడుదలకు లాక్ డౌన్ కారణంగా నోచుకోలేదు. అయితే నెట్టింట్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ పిక్ కాస్త ఇపుడు వైరల్ అయింది.

వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ నల్ల కోటు ధరించి న్యాయస్థానం లో వాదిస్తూ ఉన్నటువంటి పిక్ లీక్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానుల సంతోషానికి అవధులు లేవు. అఫిషియల్ గా విడుదల చేయకపోవడం కారణంగా ఈ పిక్ ను షేర్ చేయడం కుదరడం లేదు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయినా ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా అలరించింది. ఇందులోని మగువ మగువ పాట సైతం అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. నివేద థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ లు ఈ చిత్రం లో కీలక పాత్ర పోిస్తున్నారు.