“సాహో” తరహా ప్లానింగ్ లోనే ప్రభాస్ 20 కూడా?

Sunday, June 21st, 2020, 10:56:31 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం కు “రాధే శ్యామ్” అనే టైటిల్ పరిగణలో ఉంది. అయితే ప్రభాస్ కు ఎప్పుడైతే బాలీవుడ్ స్టాండర్డ్ వచ్చిందో దానిని అలా కొనసాగించేందుకు అతనితో సినిమా చేస్తున్న మేకర్స్ కూడా అదే ప్లాన్ లో ఉన్నారు.

అందులో భాగంగానే దర్శకుడు సుజీత్ తో తెరకెక్కించిన “సాహో” కూడా ఎక్కువగా బాలీవుడ్ నేటివిటినే మెయిన్ గా తీసుకున్నట్టు తెరకెక్కించారు. క్యాస్టింగ్ నుంచి సాంగ్స్ వరకు కూడా అక్కడి సంగీత దర్శకుల తోనే చేసారు.

అలా ఇప్పుడు ప్రభాస్ 20 కు కూడా ఇతర సంగీత దర్శకులతోనే ఒక్కో పాటను చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒక రెండు పాటలు ఒక తమిళ్ సంగీత దర్శకునితో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇంకా దీనిపై ఇంకా సరైన సమాచారం రావాల్సి ఉంది.