మరో సెన్సేషన్ రికార్డ్ సెట్ చేసిన హీరో ప్రభాస్..!

Tuesday, July 7th, 2020, 06:23:45 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తన హైట్, ఫిజిక్, మాస్ యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బాహుబలి సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు.

ప్రభాస్ ఫేస్‌బుక్‌ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 15 మిలియన్లు దాటింది. గత నెలలో 14 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్‌కు ఒక నెలలోనే ఒక మిలియన్ ఫాలోవర్స్ పెరగడం విశేషం. దీంతో దక్షిణాదిలో ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.