రివ్యూ రాజా తీన్‌మార్ : పిఎస్వి గరుడ వేగ – రాజశేఖర్ ను నిలబెట్టిన ప్రవీణ్ సత్తారు

Friday, November 3rd, 2017, 04:59:46 PM IST

కెప్టెన్ ఆఫ్ ‘పిఎస్వి గరుడ వేగ ‘ : ప్రవీణ్ సత్తారు

మూల కథ :

ఎన్ఐఏలో శేఖర్(రాజశేఖర్) ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అతడి భార్య(పూజ కుమార్) తో అతనికి నిత్యం గొడవలు జరుగుతుంటాయి. అదే సమయంలో ఓ సంక్లిష్టమైన కేసుని అతడు టేకప్ చేస్తాడు. పోలీస్ లకు సవాల్ గా మారిన ఓ హ్యాకర్(ఆదిత్) అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతాడు. ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు ? అతనికి ప్రజల ప్రాణాలు తీయవలసిన అవసరం ఏమొచ్చింది ? దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటి ? అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

–> సినిమాలో భారీతనం చాలా చోట్ల కనబడింది. యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్లు, విజువల్స్, మేకింగ్ వంటి అంశాలు సాంకేతికంగా గొప్పస్థాయిలో ఉన్నాయి. కాబట్టి వాటిని రూపొందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, డబ్బు పెట్టిన నిర్మాతకు మొదటి విజిల్ వేయాలి.

–> ఫస్టాఫ్ మొత్తం హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో, యాక్షన్ సన్నివేశాలతో సాగిపోయి మంచి వినోదాన్ని అందించింది. కాబట్టి రెండో విజిల్ మొదటి అర్థ భాగానికి వేయాలి.

–> రాజశేఖర్ భార్యగా హీరోయిన్ పూజ కుమార్, విలన్ గా కిశోర్, రాజశేఖర్ భిన్నమైన పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రాఫర్ అంజి వర్క్ ఆకట్టుకున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా నెమ్మదించింది. ఇది ప్రేక్షకులకి నిరుత్సాహాన్ని కలిగించే అంశం.

–> కీలకమైన స్కామ్ అంశం రివీల్ అయ్యే విధానంలో స్పష్టత లోపించింది. దీంతో ఆ ఎపిసోడ్ ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది.

–> పూజ కుమార్ పై సాగే కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉండటం, కిశోర్ పాత్ర తాలూకు సీన్లు కొన్ని బలహీనంగా ఉండటం కొంత లోపనగా అనిపించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ సినిమాలో అంటుగా ఆశ్చర్యానికి లోనయ్యేలా అసహజమైన సన్నివేశాలు, లాజిక్కులు ఎదురవలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : సినిమా ఫస్టాఫ్ అయితే చాలా బాగుంది.
–> మిస్టర్ బి : అవును. సెకండాఫ్ కూడా ఆ స్థాయిలోనే ఉంటే బాగుండేది.
–> మిస్టర్ ఏ : అవును. సెకండాఫ్ కొద్దిగా స్లో అయింది.
–> మిస్టర్ బి : ఏది ఏమైనా ప్రవీణ్ సత్తారు రాజశేఖర్ ను నిలబెట్టాడు.