రివ్యూ రాజా తీన్‌మార్ : రాధ – శర్వా చేసిన రొటీన్ కమర్షియల్ అటెంప్ట్

Friday, May 12th, 2017, 06:41:14 PM IST

తెరపై కనిపించిన వారు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి

కెప్టెన్ ఆఫ్ ‘రాధ’ : చంద్ర మోహన్

మూల కథ :

చిన్నతనం నుండి కృష్ణుడంటే ఎక్కువగా ఇష్టపడే కుర్రాడు రాధాకృష్ణ (శర్వానంద్) పెద్దయ్యాక పోలీస్ అవ్వాలని నిర్ణయించుకుని చివరికి పోలీస్ అయి ఒక పల్లెటూరికి పోస్టింగ్ కు వెళతాడు. అలా డ్యూటీ మీద ఆ ఊరికి వెళ్లిన రాధాకృష్ణ అదే ఊరిలో ఉండే రాధ (లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు.

కానీ అతనే హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అలా హైదరాబాద్ వచ్చిన అతనికి లోకల్ గా ఉండే పొలిటీషియన్ చేసిన నేరాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కు తలపెట్టిన ద్రోహం తెలిసి ఎలాగైనా అతన్ని చంపాలని అనుకుంటాడు. అసలు ఆ పొలిటీషియన్ చేసిన తప్పులేంటి ? అతన్ని రాధ ఎలా శిక్షించాడు ? అనేది తెరపై చూడాల్సిన సినిమా..

విజిల్ పోడు :

–> సినిమాలో హీరో శర్వానంద్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కమర్షియల్ సినిమాలకి అవసరమైన ఎంటర్టైన్మెంట్ ను అందివ్వడానికి శర్వానంద్ సాయశక్తులా ప్రయత్నించాడు. అతని నటనకు మొదటి విజిల్ వేయొచ్చు.

–> ఇక దర్శకుడు చంద్ర మోహన్ సెకండాఫ్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. అందులో హీరోకి, విలన్ కి మధ్య నడిచే డ్రామా, హీరో హీరోయిన్ల రొమాంటిక్ లవ్ ట్రాక్ బాగున్నాయి. కనుక సెకండాఫ్ కు రెండవ విజిల్ వేయొచ్చు.

–> అలాగే సినిమాలో ప్రధానంగా చెప్పాలనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని కాస్త ఎమోషనల్ గానే చెప్పారు. ఈ అంశానికి చివరి విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఫస్టాఫ్ మొదలుపెట్టడం బాగానే ఉన్నా పోను పోను అది కాస్త రొటీన్ గా మారిపోయింది. పైగా హీరోని ఎలివేట్ చేసే సీన్లు పదే పదే వస్తుండటం కూడా కాస్తంత చిరాకు పెట్టింది.

–> ఇంటర్వెల్ సమయానికి కానీ సినిమా అసలు కథలోకి ప్రవేశించకపోవడం, ఫస్టాఫ్లో పెద్దగా ఫన్ కూడా దొరక్కపోవడంతో నిరుత్సాహానికి గురిచేసింది.

–> ఇక మధ్యలో వచ్చే పాటల సంగీతం ఏమంత గొప్పగా లేదు. సెకాండాఫ్లోని చాలా సీన్లను ముందుగానే ఊహించేయొచ్చు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> హీరో, విలన్ మధ్య ఫైట్ మొదలైన దగ్గర్నుంచి ప్రతీసారి హీరోదే పైచేయి అవుతుంది కానీ ఎక్కడ విలన్ అనేవాడు కాస్తంత పవర్ కూడా చూపించేలేకపోతాడు. ఇది చాలా సినిమాల్లో కనిపించే విడ్డూరమే.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : శర్వానంద్ ఈసారి సక్సెసయ్యాడా లేదా ?
మిస్టర్ బి : అంటే ఖచ్చితంగా చెప్పలేం.
మిస్టర్ ఏ : మరి దీని రిజల్ట్ ఏమనుకోవాలి ?
మిస్టర్ బి : కమర్షియల్ హీరో అనిపించుకోడానికి శర్వా చేసిన రొటీన్ కమర్షియల్ అటెంప్ట్ అనుకోవాలంతే.