మాస్క్ లతో బాహుబలి, భళ్ళాల దేవ…మహిష్మతి సామ్రాజ్యం అయినా మాస్క్ తప్పనిసరి!

Friday, June 26th, 2020, 07:17:30 PM IST

బాహుబలి చిత్రం అశేష ప్రజాదరణ పొందిన సినిమా, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాహుబలి, భళ్లాల దేవ లు మాస్క్ లతో దర్శనం ఇచ్చారు. మహిస్మతి సామ్రాజ్యం అయినా మాస్క్ తప్పని సరి అంటూ సామాజిక స్పృహ కలిగేలా వీడియో ను తయారు చేశారు. అయితే ఇపుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం లోని క్లైమాక్స్ కి ధియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ సూపర్ అని చెప్పాలి. అయితే అదే సన్నివేశానికి హీరో ప్రభాస్ మరియు రాన ల కి మాస్క్ లను పెట్టీ వీడియో ను ఎడిట్ చేశారు. దీన్ని దర్శకుడు రాజమౌళి కాస్త సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది ఈ వైరస్ భారిన పడుతున్నారు. అయితే కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇంకా వాక్సిన్ కూడా అందుబాటు లో లేకపోవడం తో ఈ కేసులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఇంట్లోనే సేఫ్ గా ఉండండి అంటూ ఈ వీడియో కి కాప్షన్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మహిస్మటి సామ్రాజ్యం అయినా మాస్క్ తప్పని సరి అని అన్నారు. దీని పై నెటిజన్లు స్పందిస్తున్నారు. రౌద్రం రణం రుదీరం చిత్రానికి సంబంధించిన కొమరం భీం ఫస్ట్ లుక్ లేదా వీడియో ఇంకా విడుదల చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు.