డీవీవీ మూవీస్ వారి మీద చరణ్ అభిమానుల ఆగ్రహం..!

Saturday, November 3rd, 2018, 09:29:00 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందని అందరికీ తెలుసు. ఇప్పటికే టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందు ఉంచుతామని ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినా డి వి వి ఎంటర్టైన్మెంట్స్ వారు ఖరారు చేసేశారు. అయితే ఎప్పుడో మొదలైన ఈ చిత్రంకు సంబంధించి ఎప్పుడు ఏవో వర్కింగ్ స్టిల్స్, ఆన్ లొకేషన్ ఫొటోలు బయటకు రావడం తప్ప ఒక ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు.

దీనితో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సినిమా మొదలు పెట్టి 10 నుంచి 50, 60 శాతం పూర్తయిన ఒక్క పోస్టర్ అయినా వదులుతారని కానీ ఇక్కడ రామ్ చరణ్ సినిమా మొత్తం పూర్తయిన సరే ఫస్ట్ లుక్ కూడా లేదని ఇక సినిమా మొత్తం విడుదల అయ్యి వెళ్లిపోయిన తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్లు వదులుతారా అని ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన డి వి వి ఎంటర్టైన్మెంట్స్ వారి మీద చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.