ఆనందయ్య కోసం కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ – ఆర్జీవీ

Saturday, May 22nd, 2021, 03:04:06 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది. కరోనాకు ఆయన ఇస్తున్న మందు సత్పలితాలు ఇస్తుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా ఒక్కసారిగా పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతుండడంతో వేలాది మంది ఆనందయ్య మందు కోసం బారులు తీరారు. అయితే ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేయించాలని కోరగా ఐసీఎంఆర్ బృందం వెళ్లి దీనిపై అధ్యయనం చేస్తుంది.

అయితే ఆనందయ్య గురుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ వెళ్తున్నారని విన్నానని, ఆనందయ్యతో కరోనా రెసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికే అయ్యుండొచ్చని ఆర్జీవీ అన్నారు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి సైనిక భద్రత కల్పించొచ్చు కదా అంటూ ట్వీట్ చేశారు.