ఉప్పెన లో రాయనం పాత్రకి విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పకపోవడానికి అసలు కారణం ఇదే!

Friday, February 12th, 2021, 08:59:56 AM IST

తొలి చిత్రానికి ఇంతటి హైప్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది. హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లు ఇద్దరు తొలి సారి ఈ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సన తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో హీరో హీరోయిన్ పాత్రల తో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా విజయ్ సేతుపతి పాత్ర పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విజయ్ సేతుపతి చక్కగా తెలుగు మాట్లాడటం అలవాటు ఉన్నప్పటికీ సినిమా కి తన వాయిస్ ఇవ్వకపోవడం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి విజయ్ సేతుపతి పాత్ర పై కూడా చర్చలు జరిగాయి. అయితే విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పక పోవడానికి కారణం వేరే ఉన్నట్లు తెలుస్తోంది. రాయణం అనే పవర్ ఫుల్ పాత్రకి తన వాయిస్ సెట్ కాదు అని విజయ్ సేతుపతి భావించారు అట. అందుకనే గతం లో అతనికి డబ్బింగ్ చెప్పిన వారితో చెప్పిద్దాం అని అనుకున్నా, చివరగా బొమ్మాళి రవి శంకర్ ను ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది అయితే బొమ్మాళి రవి శంకర్ సాధారణంగా తన డబ్బింగ్ ను ఒక్క రోజులో పూర్తి చేస్తారు. అయితే ఈ పాత్ర కోసం మూడు రోజుల సమయం తీసుకున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. అభిమానులు, ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఈ ఉప్పెన చిత్రం శుక్రవారం నాడు థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.