డబ్బులు పోతాయని భయపడే మహేష్ బాబుతో ఆ సినిమా చేయలేదట

Saturday, May 14th, 2016, 02:25:22 PM IST


మనం సినిమాతో తెలుగులో భారీ హిట్టు కొట్టి తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చిన దర్శకుడు విక్రం కుమార్ తాజాగా సూర్యతో 24 అనే ఫిక్షన్ సినిమా తీసి మళ్ళీ హిట్టు కొట్టారు. అసలు విక్రం కుమార్ ఈ సినిమా కథను మొదట మహేష్ బాబుతో చెయ్యాలనుకుని ఆయనకు చెప్పాడని, సెకండ్ హాఫ్ కథ మహేష్ కు నచ్చక సినిమా వద్దన్నాడని కథనాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ విక్రమ్ సమాధానం చెప్పారు.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కథ మహేష్ బాబుకు చాలా బాగా నచ్చిందని కానీ అలా ఆత్రేయ పాత్రలో ముసలి గడ్డం, మాసిన దుస్తులు, వీల్ చైర్ లో కూర్చోవడం, ఓ చెడ్డ వ్యక్తిలా ప్రవర్తన వంటి వాటిని మహేష్ బాబు చేస్తే ప్రేక్షకులు తట్టుకోలేరని, చూడలేరని, అప్పుడు డబ్బులు పెట్టిన నిర్మాతకు నష్టం అని అందుకే ఆయన ఆ సినిమాకు ఒప్పుకోలేదని అనుకుంటున్నానని విక్రం కుమార్ తెలిపారు. ఆ తరువాత సూర్యను హీరోగా ఎంచుకున్నాక నన్ను పిలిచి మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ సినిమాకు నేను కరెక్ట్ కాదు అని అన్నారని కూడా తెలిపారు.