మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఆర్జీవీ చెలగాటం… పవర్ స్టార్ అంటూ కొత్త సినిమా!

Sunday, June 28th, 2020, 08:45:20 PM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్తగా పవర్ స్టార్ అంటూ సినిమా అనౌన్స్ చేశారు. చేయడం మాత్రమే కాకుండా ఇందులో పికే, ఎం ఎస్, ఎన్ బి, టీ ఎస్ లతో పాటుగా ఒక రష్యన్ స్త్రీ, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది బర్రెలతో పాటుగా ఆర్జీవీ కూడా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆ షార్ట్ కట్ లో అర్దం కాని పేర్లను కనుగొన్నందుకు ఎలాంటి బహుమతి ఇవ్వడం లేదు అని అన్నారు.

అంతేకాక ఈ అనౌన్స్ మెంట్ తో పాటుగా మరొక ట్వీట్ లో ఆర్జీవీ ఆ చిత్రం లో పని చేస్తున్న స్టార్ అంటూ ఒక వీడియో ను షేర్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రూపం లో ఉన్న వ్యక్తి వీడియో కాస్త వైరల్ గా మారింది. గత కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్యూచర్ సీఎం అని రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ను కొనియాడారు.పవన్ అభిమానులు తేరుకొనే లోపే పవన్ కళ్యాణ్ డూప్ తరహా లో పవర్ స్టార్ అంటూ సినిమా ను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ లాక్ డౌన్ లో సినిమా ఎలా ఉన్నా తన ఐడియాలజీ తో సొమ్ము చేసుకుంటున్న వర్మ ఇపుడు పవర్ స్టార్ తో చెలగాటం ఆడుతున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.