పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న “ఆర్ఆర్ఆర్” టీమ్

Friday, February 19th, 2021, 08:30:41 AM IST

టాలీవుడ్ నుండి ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యే చిత్రాల్లో రౌద్రం రణం రుధిరం ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల అక్టోబర్ 13 కి పక్కగా వస్తున్నట్లు డేట్ ను ప్రకటించింది. అయితే ఈ చిత్రం ఈ సారి అనుకున్న సమయానికి విడుదల అయ్యేలా అనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ లో సినిమా చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అనంతరం నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటూ అన్ని విధాలా అనుకున్న సమయానికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ తీవ్ర కృషి చేస్తుంది. అయితే అందుకు సంబంధించిన ఒక చిన్న వీడియో ను సోషల్ మీడియా వేదిక గా చిత్ర యూనిట్ షేర్ చేసింది. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తొలిసారి గా రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా కలిసి నటిస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో వీరి తో పాటుగా అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు.