వాక్సిన్ పై వస్తున్న అపోహలను నమ్మకండి – ఆర్ఆర్ఆర్ టీమ్

Thursday, May 6th, 2021, 04:31:59 PM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో నే అత్యంత ప్రమాదకరం గా ఈ వైరస్ ఉగ్ర రూపం దాల్చింది. నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మూడు వేలకు పైగా కరోనా వైరస్ మరణాల తో భారత్ భయాందోళన చెందుతోంది. అయితే కరోనా వైరస్ ను అవగాహన ద్వారా ఎదుర్కోవడం పట్ల తాజాగా రౌద్రం రణం రుధిరం చిత్ర యూనిట్ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోమాట్లాడిన ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

అందరికీ నమస్కారం, సెకండ్ వేవ్ లో భాగంగా కరోనా వైరస్ కేసులు రికార్డ్ స్ధాయిలో పెరుగుతున్నాయి అని, గతేడాది కలసి కట్టుగా ఉండి, కరోనా కి వ్యతిరేకంగా పోరాడాం అని అన్నారు. మళ్ళీ అలాగే పోరాడుదాం అంటూ చెప్పుకొచ్చారు. మాస్క్ ధరించడం, చేతులను సానిటైజ్ చేసుకోవడం, జనం లోకి వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటించడం వంటివి కరోనా వైరస్ పై పోరాడేందుకు మన దగ్గర ఉన్న ఆయుధాలు అంటూ పేర్కొన్నారు. వాక్సిన్ పై వస్తున్న అపోహలను నమ్మకండి అని, కుటుంబ సభ్యులను, స్నేహితులను టీకా వేయించుకొనే విధంగా ప్రోత్సహించండి అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయం లో ఇంట్లోనే ఉండటం ముఖ్యం అని, అవసరం అయితేనే బయటికి వెళ్ళండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే మాస్క్ పెట్టుకోవడం తో పాటు,టీకా వేయించుకుంటా అని ప్రతిజ్ఞ చేద్దాం అని అన్నారు. మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో కి #standtogether అంటూ హ్యష్ ట్యాగ్ జత చేశారు. అంతేకాక ఈ వీడియో లో అలియా భట్ తెలుగు లో, రామ్ చరణ్ తమిళ్ లో, ఎన్టీఆర్ కన్నడ లో, రాజమౌళి మలయాళం లో, అజయ్ దేవగణ్ హిందీ లో మాట్లాడారు.

అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లుగా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం ఈ ఏడాది అక్టోబర్ 13 న విడుదల కావాల్సి ఉంది. అయితే మళ్ళీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో హీరోయిన్ లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటించగా, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.