ప్రభాస్ “సలార్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sunday, February 28th, 2021, 09:04:48 PM IST

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ హీరో గా నటిస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రానికి సంబంధించిన ఒకొక్క అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, కేజీఎఫ్ మరియు కేజీఎఫ్ 2 చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే 14 వ తేదీ నుండి వరుసగా మరో మూడు రోజులు సెలవు దినాలు కావడం తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం తో పాటుగా అటు ఆది పురష్ మరియు నాగ్ అశ్విన్ ల తో మరొక సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. అయితే ఇవన్నీ కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు కావడం గమనార్హం. బాహుబలి తర్వాత చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా తరహాలో చేస్తున్నారు ప్రభాస్.