ఆ ఫోటోలో నాగ చైతన్య పక్క ఉన్నది సమంతేనా..?

Thursday, June 2nd, 2016, 04:20:19 PM IST


ఈ మధ్య టాలీవుడ్ లో సమంత చుట్టూ రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ ప్రెస్ మీట్ లో తన ప్రేమ గురించి సమంత చిన్న హింట్ ఇచ్చింది. అంతే మీడియా వర్గాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు అల్లేసుకున్నారు. ఆ తరువాత కూడా తను ప్రేమించే వ్యక్తి సినిమా రంగానికి చెందిన ఓ యంగ్ హీరో అని సమంత చెప్పంది. దీంతో అందరూ సమంత పెళ్లి చేసుకోబోయేది అక్కినేని వారసుడు నాగ చైతన్యనే అని ఫిక్సైపోయారు.

ఎందుకంటే సమంత నాగ చైతన్య సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత అతనితో కలిసి మనం సినిమాలో కూడా నటించిది. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో అందరూ అతన్నే ఫిక్సైపోయారు. పైగా సమంత గాని, నాగ చైతన్య గాని ఇవి రూమర్లని బయటకొచ్చి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఈ వార్తకు బలం చేకూరుస్తూ తాజాగా నాగ చైతన్య ఫోటో ఒకటి బయటకొచ్చింది. అందులో అతని పక్కన ఉన్న అమ్మాయి ఫేస్ క్లారిటీగా లేకపోయినా ఆమె సమంతేనని, వారిద్దరూ అ.. ఆ.. సినిమా చూసేందుకు ఏదో థియేటర్ కు వెళ్ళారని అందరూ అంటున్నారు. కావాలంటే ఆ ఫోటో మీరు చూసి ఆమె ఎవరో గుర్తుపట్టండి.