‘అ ఆ’ యూనిట్ లో ‘సర్దార్’ సందడి.. దీని గురించి వచ్చినట్టు..!

Thursday, April 21st, 2016, 10:23:54 AM IST


నితిన్ హోరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా రూపొందుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూటింగ్ జూబ్లిహిల్స్ లో చేస్తున్నారు. అయితే, షూటింగ్ చేస్తున్న సమయంలో సడెన్ గా అ ఆ సెట్ లోకి అనుకోని అతిధి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెల్ల చొక్కా, తెల్ల లుంగీతో ఒక సాధారణ వ్యక్తిగా సెట్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాదాపు రెండు గంటలపాటు సెట్ లో పవన్ కళ్యాణ్ హీరో నితిన్, దర్శకుడు, పవన్ స్నేహితుడైన త్రివిక్రమ్ తోనూ అలాగే, నిర్మాత రాధాకృష్ణతో మాట్లాడి వెళ్ళాడు. అయితే, సడెన్ గా పవన్ కళ్యాణ్ అ ఆ సెట్ కు ఎందుకు వచ్చాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. సూర్య సినిమా తరువాత ఈ సినిమా ఉండే అవకాశం ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ అ ఆ సెట్ కి రావడం వలన అ ఆ సినిమాకు కూడా ప్రమోట్ అయినట్టు ఉంటుందని కూడా భావించి ఇలా వచ్చి ఉంటాడని కొందరి అభిప్రాయం. ఏదైతేనేం.. అ ఆ సెట్ లో పవన్ సందడి ఇప్పుడు నెట్ లో హాల్ చల్ చేస్తున్నది.