మరోసారి బుల్లితెర పై దుమ్ములేపనున్న సూపర్ స్టార్ మహేష్!

Sunday, June 28th, 2020, 01:25:56 PM IST

మహేష్ బాబు గత కొద్దీ సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమ కి బ్లాక్ బస్టర్ విజయాలను అందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ తన మార్క్ స్టైల్ తో, నటన తో, సామాజిక స్పృహ కలిగించేలా సినిమాలను చేస్తున్నారు. అయితే అదే తరహాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిలేరూ నీకెవ్వరూ చిత్రం ను అందించారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర పై సందడి చేసింది. ఇప్పుడు మరోసారి మీ ముందుకు రాబోతుంది.

జూన్ 28 న అనగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది. ఈ చిత్రం బుల్లి తెరపై కూడా తన సత్తాను చూపింది. మరోసారి బుల్లి తెర ను దుమ్ము లేపెందుకు సిద్దం అయింది. ఈ చిత్రాన్ని ఇప్పటికే ఎవరైనా మిస్ అయి ఉంటే చూసేయండి. మహేష్ బాబు తన కెరీర్ లోనే మైలు రాయి గా నిలిచిన ఈ చిత్రం లో రశ్మిన మందన్న హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం లో సీనియర్ నటి విజయ శాంతి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమా కు హైలెట్ అని చెప్పాలి. అద్యంతం కామెడీ తో దేశ భక్తి నీ చాటే ఈ సరిలేరూ నీకెవ్వరు చిత్రం ను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. డోంట్ మిస్ ఇట్.