బిగ్ వైరల్: “సర్కార్ వారి పాట” సినిమా స్టోరీ లైన్ అదేనట..!

Tuesday, June 23rd, 2020, 02:08:06 AM IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌కి విపరీతమైన క్రేజ్ లభించింది.

ఆ పోస్టర్‌లో మహేశ్ బాబు లుక్, మెడపై టాటూ, హెయిర్ స్టైల్ అన్ని కూడా ఫాన్స్‌ను బాగా కట్టిపడేసింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ అవినీతికి సంబంధించిన సామాజిక అంశం గురుంచి ఉండబోతుందని, ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ స్క్రిప్ట్ రాశారని, ఇందులో హీరో ఓ బ్యాంకు మేనేజర్ అని, ఆర్థిక నేరంలో భాగంగా వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా వ్యాపారవేత్త దగ్గర నుండి ఆ కోట్ల డబ్బును ఎలా తిరిగి రాబట్టాడనేదే ఈ సినిమా స్టోరీ అని ప్రచారం జరుగుతుంది.