2.0 లో శంకర్ మళ్ళీ అవే సీన్లు రిపీట్ చెయ్యబోతున్నాడా..?

Saturday, November 3rd, 2018, 09:31:23 PM IST


విలక్షణ దర్శకుడు శంకర్ మరియు తమిళ్ తలైవా రజిని కాంబినేషన్ అంటే ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం వేరే చెప్పక్కర్లేదు.ఇప్పటికే వీరు తీసిన రెండు సినిమాలు చూసుకుంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు కూడా అంతకు మించిన స్థాయిలో 2.0 చిత్రంతో మళ్ళీ బాక్సాఫీస్ మీదకు యుద్ధాన్ని ప్రకటించారు.అదే సందర్భంలో ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈ రోజు మధ్యాహ్నం విడుదలయ్యింది.అంతే ఈ సినిమా మీద ఉన్న అంచనాలను ఇంకా ఎక్కువ చేసేసాడు.

అయితే ఈ చిత్ర ట్రైలర్ మరియు టీజర్లను మనం గమనించినట్లయితే దీనికి ముందు వచ్చిన రోబో చిత్రంలోని క్లైమాక్స్ సీన్లు ఖచ్చితంగా గుర్తొచ్చే ఉంటాయి.రోబో క్లైమాక్స్ లో అన్ని రోబోలు కలిసి రకరకాల ఆకృతుల్లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.మనం ఈ 2.0 చిత్రం యొక్క ట్రైలర్ మరియు టీజర్లను చూసుకున్నా సరే శంకర్ మళ్ళీ ఆ పాత సీన్లకే మళ్ళీ పాలిష్ పెట్టి ఈ చిత్రంలో పెడుతున్నారా అన్న అనుమానం కలుగుతుంది.అంతే కాకుండా రోబో చిత్రంలోనే చివర్లో అన్ని రోబోలు కలిసి ఒక పెద్ద రోబో మాదిరిగా మారుతుంది.2.0 ట్రైలర్లో కూడా అక్షయ్ కుమార్ కు రజినికి కూడా అదే స్థాయి యుద్ధం జరిగే సన్నివేశాలు కూడా ఉన్నాయి.వీటి బట్టి శంకర్ మళ్ళీ అదే రకమైన సీన్లను తీసాడా అన్న అనుమానం కలుగుతుంది.