నా దేశానికి ఆక్సిజన్ కావాలి.. సోనూసూద్ భావోద్వేగ ట్వీట్..!

Monday, May 3rd, 2021, 06:38:20 PM IST

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఎటుచూసినా ఆసుపత్రులన్ని కరోనా పేషంట్లతో నిండిపోయాయి. దీంతో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు కూడా తనకు తోచిన విధంగా జనాలకు సాయపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

అయితే నా దేశానికి ఆక్సిజన్ కావాలి అంటూ దండం పెడుతున్న ఎమోజీతో ట్వీట్ చేశారు. ఒక్క ఆక్సిజన్ మాత్రమే అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా వైద్య సాయం కోసం వేలాది విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్లాస్మా, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్లు సాయం చేస్తూ ఎంతో మందికి ఆపాధ్భాందవుడిలా నిలుస్తున్నాడు.