బిగ్ న్యూస్: రాజమౌళికి సోకిన కరోనా!

Wednesday, July 29th, 2020, 10:02:14 PM IST


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచిపెట్టడం లేదు. రాజకీయ, సినీ రంగం లోని ప్రముఖులు సైతం ఈ వైరస్ భారిన పడి బాధపడుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు, జక్కన్న రాజమౌళి కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు జ్వరం తో బాధపడుతున్నాం అని అన్నారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని అన్నారు.

అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరం బాగానే ఉన్నాం అని అన్నారు. వైద్యుల సలహా మేరకు రోగ నిరోధక శక్తి ను పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు. అయితే కరోనా వైరస్ భారీ నుండి బయట పడిన అనంతరం ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్దం అవుతున్నాం అని రాజమౌళి అన్నారు. బాహుబలి సిరీస్ చిత్రాలతో కేవలం భారత దేశం లో మాత్రమే కాక, యావత్ ప్రపంచ దేశాలు సైతం తెలుగు సినీ పరిశ్రమ మెచ్చుకొదగ్గ దర్శక ధీరుడు రాజమౌళి. RRR చిత్రం తో బిజీగా ఉన్న రాజమౌళి కరోనా వైరస్ కారణంగా పనులను వాయిదా వేశారు. అయితే ఇపుడు రాజమౌళి చేసిన ప్రకటన అభిమానులను కాస్త ఆందోళనలకు గురి చేసింది అని చెప్పాలి.