ఈ సూపర్ హిట్ సినిమా టైం ను మార్చిన స్టార్ మా.!

Thursday, June 25th, 2020, 12:50:53 PM IST

ఈ ఏడాది కరోనా దాడి ఇంకా తీవ్ర స్థాయిలోకి మారకముందు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అదిరిపోయే హిట్టయిన చిత్రం “కనులు కనులను దోచాయంటే”. దుల్కర్ సల్మాన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

అలాంటి ఈ చిత్రాన్ని స్టార్ మా ఛానెల్ వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అదే రోజులో వారు ఈ చిత్రాన్ని మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చెయ్యనున్నట్టుగా తెలిపారు. సో ఈ మోస్ట్ ఎంటర్టైనింగ్ సబ్జెక్టుని అప్పుడు కనుక మిస్సయినట్టైతే ఈసారి తప్పకుండ చూడండి మీరు మంచి థ్రిల్ కు లోనవ్వడం ఖాయం.