పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు!

Monday, May 3rd, 2021, 02:01:53 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం లో ఒక్క సన్నివేశం లో తన ఫోన్ నంబర్ వాడుకున్నారు అంటూ సుధాకర్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన అనుమతి లేకుండా సినిమా లో నీ ఒక సన్నివేశం లో తన ఫోన్ నంబర్ ను స్క్రీన్ మీద చూపించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం పట్ల సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అతని ఫోన్ నంబర్ వాడుకోవడం వలన ఎంతో మంది తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు అని ఫిర్యాదు లో పేర్కొన్నారు. అంతేకాక కొందరు అయితే నోటికి వచ్చినట్లు తిడుతున్నారు అంటూ అవేదన వ్యక్తం చేశారు. అయితే బాధితుడి తరపు లాయర్ వకీల్ సాబ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపడం జరిగింది. అయితే దీని పై చిత్ర నిర్మాతలు స్పందించాల్సి ఉంది.

అయితే అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తీసుకొని మళ్ళీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అంతేకాక అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం ఈ సినిమా కి మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ న్యాయవాది గా వచ్చిన ఈ చిత్రం పింక్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం లో అనన్య, నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటించగా, పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ అద్భుత నటన ఈ సినిమా కి హైలెట్ అని చెప్పాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం తమన్ అందించారు.