బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితం అర్ధాంతరంగా ఎంతో భవిష్యత్తు ఉండగానే ముగిపోయింది. అతని మరణం పట్ల రెండు కోణాలు వినిపిస్తున్నాయి. దీనితో అతని మరణంపై ప్రతీ ఒక్కరు సానుభూతి చూపించడం తప్పించి అంతకు మించి ఏమి చెయ్యలేకపోతున్నారు.
బాలీవుడ్ లో కొందరు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీస్కొని గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. కానీ సుశాంత్ కు సంబంధించి బయటకొస్తున్న ఒక్క అంశం వింటుంటే ప్రతీ ఒక్కరినీ మరింత బాధిస్తుంది. అలాంటి ఓ అంశాన్నే సుశాంత్ తండ్రి ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించినట్టు తెలుస్తుంది.
సుశాంత్ కు వచ్చే 2021 లో పెళ్లి నిశ్చయం చేశామని, ఈ కరోనా సమయంలో ఎలాంటి హడావిడి వద్దు నెమ్మదిగా 2021 లో పెళ్లి చేసుకొనేందుకు సుశాంత్ అంగీకరించాడని కానీ ఈలోపే ఇదంతా జరిగిపోయిందని సుశాంత్ తండ్రి తెలిపారు.