సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో బయటకొచ్చిన మరో దారుణ నిజం.!

Wednesday, July 29th, 2020, 03:18:07 PM IST

ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా మొత్తం మన దేశంలోనే సంచలన కేసుగా మారింది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంతో టాలెంట్ కలిగిన ఈ హీరో ఊహించని విధంగా ఆత్మ హత్య చేసుకున్నాడన్న వార్తలు రావడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్లో అలజడి మొదలయ్యింది. ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించనిది.

దీనితో దీని వెనుక ఖచ్చితంగా బలమైన కారణమే ఉండి ఉంటుంది అని ఆ కారణాలను కారకులను పలువురు బాలీవుడ్ పెద్దలు సహా సుశాంత్ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి అనుమానం ఉంది మాత్రం సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అని చెప్పాలి.

ఆమె వలెనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుశాంత్ తండ్రి ఆమెపై కేసు నమోదు చెయ్యగా ఆమెపై ఇప్పుడు మరో షాకింగ్ అంశం బయటకు వచ్చింది. సుశాంత్ డెంగ్యూ తో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె అతనికి కావాలనే ఓవర్ డోస్ మందులను ఇచ్చేది అని, ఇలా చాలా రకాలుగా సుశాంత్ ను అతను చనిపోక ముందు ఇబ్బంది పెట్టింది అని తాజా మీడియాలో వినిపిస్తున్న వార్తలు. ఏది ఏమైనప్పటికీ మాత్రం సుశాంత్ కేసులో అసలు నిజానిజాలు ఏమిటన్నది తెలియాలి.