తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Wednesday, December 3rd, 2014, 01:49:28 PM IST


తెలుగు చిత్ర పరిశ్రమ హుదూద్ బాదితుల కోసం నిర్వహించిన ‘మేము సైతం’పై టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక్కరే గంటసేపు ఓ కార్యక్రమం చేస్తే, దానికి రూ.కోటి వచ్చిందని, ఇప్పుడు పరిశ్రమ అంతా కలిసి ‘మేము సైతం’ నిర్వహిస్తే, 8 కోట్లు కూడా రాలేదని ఆయన వాపోయారు.

ఫిలింపేర్ అవార్డుల కోసం పరిగెత్తుకు వెళ్ళే ఆర్టిస్టులు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల వేడుకలకు మాత్రం రావటం లేదని త‌మ్మారెడ్డి ఆరోపించారు. గతంలో ‘మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించిన త‌మ్మారెడ్డి తాజాగా.. ‘మేము సైతం’ వంటి కార్యక్రమాలకు హీరోలు స్వచ్ఛందంగా రావాల్సి ఉండగా, రమ్మని బతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.