అప్పుడు అందాల తార – ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్

Friday, December 5th, 2014, 09:28:07 AM IST

nisha
ఆమె ఒకప్పటి మేటి హీరోయిన్. అగ్రనటులైన రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ పక్కన నాయికగా నటించింది. ప్రముఖ దర్శకులు బాలచందర్, విసు, చంద్రశేఖర్ వంటి తమిళ అగ్రదర్శకుల సినిమాలలో కూడా ఆమె నటించారు. ఆమే ప్రముఖ తమిళ నటి నిషా. ఇక కమల్ హాసన్ సరసన టిక్ టిక్ టిక్ చిత్రంలో, రజనీకాంత్ తో రాఘవేంద్ర చిత్రంలో నటించిన ఆమె పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశ మవుతోంది. అయితే ప్రస్తుతం నిషా దయనీయ స్థితిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నాయికగా ఉన్నప్పుడు ఉన్న అందచందాలన్నీ ఆవిరై ప్రస్తుతం అస్థి పంజరం లాంటి శరీరంతో ఘోరమైన స్థితిలో చూసేవారి మనసు కలచివేసే స్థితిలో ఎయిడ్స్ రోగిగా బాధపడుతున్నారు.

ఇక నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న ఫోటోలు ఇటీవల సోషల్ నెట్ వర్క్ సైట్లలో హల్ చల్ చేస్తుండడంతో ఆమె దయనీయ స్థితి ప్రజలకు తెలిసింది. కాగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆస్థి పంజరం వంటి దేహంతో నాబూర్ దర్గా వద్ద వారంరోజులుగా అనాధలా పడి ఉన్న నటి నిషాను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె శరీరంపై చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి. ఇక ఆమె దయనీయ స్థితిని చూసిన మానవ హక్కుల సంఘం సభ్యుడు మురుగన్ వెంటనే నిషాకు వైద్యం అందించేలా ఏర్పాట్లు చెయ్యాలని నాగపట్టణం జిల్లా కలెక్టర్ ని, పోలీసులకు విజ్ఞ్యప్తి చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై నాలుగు వారాల్లో నివేదిక అందించాలని కోరారు.