ఆ ఇన్స్ పెక్టర్ మామూలోడు కాదు.. స్టార్ హీరోయిన్ ని నడిరోడ్డుపై నడిపించాడు

Monday, May 16th, 2016, 06:11:47 PM IST


పోలీసులు మామూలుగా అరకొరగా డ్యూటీ చేస్తేనే రచ్చ రచ్చ అవుతుంది. అదే యమ స్ట్రిక్టుగా డ్యూటీ చేస్తే భీభత్సమే కదా. ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నోయిడాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ లో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి బాలీవుడ్ అందాల భామ అతిథి రావ్ హైదరి వెళుతుండగా ఆమె కారు డ్రైవర్ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని షాట్ కట్ లో రాంగ్ రూట్ తీసుకుని వెళ్ళాలని యత్నించాడు.

కానీ అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ ఆ కారుని ఆడ్డుకుని ఫైన్ వేసి పేపర్ వర్క్ చేయడం మొదలెట్టాడు. కాసేపటికి కారులో ఉన్నది ప్రముఖ హీరోయిన్ అతిథి రావ్ హైదరి అని తెలిసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుపోయాడు. ఇక చేసేది లేక టైమ్ దాటిపోతుండటంతో అతిథి రావ్ కూడా ఇన్స్ స్పెక్టర్ తో ఎలాంటి వాద్వాదం చేయకుండా సింపుల్ గా రోడ్డుఫై నడుచుకుంటూ మాల్ కి వెళ్ళిపోయారు.