‘పవన్’ తో కలిసి ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ రాజకీయ రంగ ప్రవేశం

Tuesday, May 3rd, 2016, 04:59:16 PM IST


పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ మంచి స్నేహితులు. తెలుగు సాహిత్యం, భాషాభిమానం, సమాజ స్పృహ వీరిద్దరినీ ఒక్కటి చేసిన అంశాలు. వీరు కలిసి ఏదైనా ఫంక్షన్ కు వస్తున్నారంటే అభిమానులే కాదు యావత్ తెలుగు లోకం వాళ్ళ సంభాషణలో.. ముఖ్యంగా త్రివిక్రమ్ సంభాషణలో ఎలాంటి మాటలు, అంశాలు చర్చకు వస్తాయా అని చెవులు రిక్కించుకుని చూస్తుంటారు. నిన్న త్రివిక్రమ్, నితిన్ కాబినేషన్ లో తెరకెక్కిన అ.. ఆ.. చిత్రం ఆడియో వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కార్యక్రమంలో ఏంటో మంది మాట్లాడారు. కానీ అందరూ పవన్, త్రివిక్రమ్ ల మాటల కోసం ఎదురు చూశారు.

స్టేజి పైకొచ్చిన త్రివిక్రమ్ మైక్ అందుకుని ముందుగా ‘కొండ ఒకరికి తలొంచి ఎరగదు, శిఖరం ఎప్పుడూ ఎవరికీ సలాం అనదు, కెరటం అలిసిపోయి ఎవరికోసం ఆగదు, నాకిష్టమైన స్నేహితుడు, సునామి, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు, ఎంతమందో గుండెలు తడపడానికో వచ్చే చిన్న వర్షపు చినుకు అంటూ ఉంటారా.. వెనకాలే వస్తారా.. తోడుగా ఉందాం వస్తారా.. ‘ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఆ మాటలు వింటే పవన్ ఏదో సాధిస్తాడని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో త్రివిక్రమ్ మొదటివాడు అనిపిస్తుంది. అలాగే ‘తోడుగా ఉందాం వస్తారా’ అన్న మాట వెనుక ఉన్న ఆంతర్యంలోకి వెలితే పవన్ వెనకే త్రివిక్రమ్ కూడా రాజకీయ ఆరగేట్రం చేస్తారా, పవన్ కు తోడుగా ఉంటారా..? అన్న అనుమానం రాక మానదు.

వీడియో కొరకు క్లిక్ చేయండి