జాతిరత్నాలు సినిమా చూసిన మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే?

Monday, April 12th, 2021, 11:19:21 AM IST

నవీన్ పోలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన జాతిరత్నాలు చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. ఈ ఏడాది సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు సైతం ఈ చిత్రం లో మంచి కామెడీ పండించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 39.04 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.

జాతి రత్నాలు సినిమా పై మంత్రి కేటీఆర్ ప్రశంశల వర్షం కురిపించారు. సినిమా తనకు చాలా బాగా నచ్చింది అని, కామెడీ చాలా హిలేరీయస్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కి హీరో నవీన్ పోలిశెట్టి స్పందించారు. థాంక్యూ సార్, ఈ సినిమా మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కేవీ అనుడీప్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటు లో ఉంది. ఈ సినిమా పై ఇప్పటికే ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు.