థియేటర్లలోనే టక్ జగదీశ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!

Friday, May 28th, 2021, 02:00:12 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత నెల ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ తెగ ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు హీరో నాని కూడా ఒప్పుకున్నారని, త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రయూనిట్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. టక్ జగదీశ్’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం లేదనీ, థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని తేల్చి చెప్పేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సినిమాలో నానీకి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌లుగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.