హాట్ న్యూస్ : ఉదయ్ కిరణ్ చివరి సినిమా స్ట్రీమింగ్ లోకి.!

Thursday, June 25th, 2020, 04:00:30 PM IST

గత కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ కు చెందిన యువ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య ఘటన ఎంత సెన్సేషనల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ ఘటనను అంత తేలిగ్గా కూడా ఎవరూ మర్చిపోలేరు.

ఈ ఘటన బయటకొచ్చిన సమయంలోనే మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ అంశం కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగులో ఎంతో టాలెంట్ ఉన్న ఈ హీరో కూడా కావడంతో సుశాంత్ మరణం ఉదయ్ ను ఓసారి తలపించేలా చేసింది.

అయితే ఎప్పుడు లవర్ బాయ్ లో కనిపించే ఉదయ్ కిరణ్ చివరగా చేసింది “జై శ్రీరామ్” అనే చిత్రం. ఇదే తాను హీరోగా నటించిన చివరి చిత్రం. కానీ ఇంకా విడుదల కానీ సినిమా ఒకటి ఉంది. అదే “చిత్రం చెప్పిన కథ”.

2015 లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అప్పుడు పలు కారణాల చేత విడుదలకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ డైరెక్ట్ డిజిటల్ గా అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. మోహన్ ఏఆర్ ఎల్ కే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనిత హీరోయిన్ గా నటించింది.