వకీల్ సాబ్ 8 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Saturday, April 17th, 2021, 08:20:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే సినిమా విడుదలైన తొలు నాలుగు రోజులు కలెక్షన్లు బాగానే ఉన్నా ఐదో రోజు నుంచి మాత్రం కలెక్షన్లు తగ్గిపోయినట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి 8 రోజుల కలెక్షన్లు బయటికి వచ్చాయి. నైజాంలో 22.80 కోట్లు, సీడెడ్ 11.96 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.83 కోట్లు, ఈస్ట్ గోదావరి 5.80 కోట్లు, వెస్ట్ గోదావరి 6.75 కోట్లు, గుంటూరు 6.70 కోట్లు, కృష్ణా 4.60 కోట్లు, నెల్లూరు- 3.11 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఇక ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మొత్తం 72.55 కోట్లు రాగా, వరల్డ్ వైడ్ మొత్తం 79.85 కోట్ల షేర్ వచ్చింది.