జగన్ గారికి సవాళ్లు విసిరే స్థాయా నీదా చిట్టినాయుడు – నారా లోకేశ్

Thursday, April 15th, 2021, 12:13:03 PM IST

ఏపీలో రాజకీయాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో రసవత్తరంగా మారాయి. వివేకా హత్య కేసుతో తనకు కానీ, తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని, అలా అని వైఎస్ జగన్ ప్రమాణం చేస్తారా అని నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే లోకేశ్ నిన్న అలిపిరి దగ్గర ప్రమాణం కూడా చేశారు. అయితే నా ఛాలెంజ్‌ని స్వీకరించే దమ్ము లేక జగన్ తోకముడిచి పారిపోయాడని, బాబాయ్‌ని వేసింది అబ్బాయే అన్నట్టు విమర్శలు గుప్పించారు.

అయితే నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ గారికి సవాళ్లు విసిరే స్థాయా నీది చిట్టినాయుడూ అంటూ నీ జాతకమేంటో మీ పార్టీ నేతలే విప్పుతున్నారని, నీ పార్టీ ఏపీ అధ్యక్షుడే “ఆయనే ఉంటే” అన్నట్లు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నీవు తిరుపతిలో ఉంటే ఏంటి? తింటూ ఉంటే ఏంటి? డ్యామేజీ కంట్రోల్ కోసం వెళ్లి డ్రామాలేసుకో అని ఎద్దేవా చేశారు.