సంక్రాంతికే చెర్రీ సినిమా కన్ఫర్మ్..కానీ ఫస్ట్ లుక్ డేట్ మాత్రం చెప్పరు..!

Wednesday, October 31st, 2018, 10:08:07 PM IST


మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో ఇంకా టైటిల్ ఖరారు కానటువంటి ఒక చిత్రం వస్తున్న సంగతి తెలిసినదే.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుడల చేస్తున్నామని ఎప్పుడో ప్రకటించేశారు.అయితే ఈ రెండు రోజుల నుంచి ఈ సంక్రాంతికి విడుడల కావట్లేదని ఏప్రిల్ నెలకు షిఫ్ట్ అయ్యిందని వార్తలొచ్చాయి.ఇలా వస్తున్నటువంటి వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని,ఈ చిత్ర నిర్మాణ డీవీవీ ఎంటెర్టైనెర్స్ వారు కొట్టి పారేశారు.ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో ఎట్టి పరిస్థితిలోను విడుదల చేస్తున్నామని తేల్చి చెప్పేసారు.

ఓకే ఇదంతా బాగానే ఉంది సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు అనుకుందాం కానీ కనీసం టైటిల్ అయినా చెప్పాలి కదా?ఇప్పటి వరకు టైటిల్ చెప్పలేదు,ఒక్క ఫస్ట్ లుక్ కూడా లేదు కానీ సంక్రాంతికి సినిమా మాత్రం విడుదల చేస్తున్నామన్నారు.ఇక తక్కువ సమయమే ఉంది దానికి తోడు పండుగలు కూడా ఉన్నాయి,ఈ పండగల నుంచే ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్లు విడుడల చేస్తారు అని చెర్రీ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా అతి త్వరలోనే విడుదల చేస్తున్నామని నిర్మాణ సంస్థ వెల్లడించారు.దీనితో అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.