ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ చెబుతానంటున్న‌ పవన్ మాజీ భార్య‌

Wednesday, December 3rd, 2014, 01:52:19 PM IST


ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూదేశాయ్ వ్య‌క్తిగ‌తంగా మ‌రోసారి తెరపైకి వ‌స్తున్నారు. డిసెంబర్ 4న (రేపు) తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నానని.. ఆ ఇంటర్వ్యూని యూట్యూబ్ లో చూడవచ్చని ట్విట్టర్లో తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో తన ప‌ర్స‌న‌ల్ విషయాలను వెల్లడిస్తానని చెప్పి మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది.

పవన్, రేణులు విడిపోయాక, తమ బ్రేకప్ కు గల కారణాలు ఏమిటనే విషయం ఇటు పవన్ కాని, అటు రేణు కాని వెల్లడించలేదు. అదంతా వ్యక్తిగతమంటూ దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తానని రేణూదేశాయ్ చెప్పడంతో… ఏం చెబుతుందోన‌నే అస‌క్తి నెలకొంది.