సల్మాన్ కు జైలు ఊచలు తప్పవా..?

Wednesday, December 3rd, 2014, 04:55:21 PM IST


2002లో హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బుధవారం ముంబై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో సల్మాన్ నుంచి సేకరించిన బ్లడ్ శాంపుల్స్ ని పరీక్షించగా పాజిటీవ్ గా వచ్చింది. సంబంధిత నివేదకను నిపుణులు కోర్టుకు సమర్పించారు. ఆ సమయంలో సల్మాన్ పరిమితికి మించి ఆల్కహాల్ సేవించినట్టు నిపుణులు కోర్టుకు వెల్లడించారు. 2002లో సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో కారు నడిపి, ముంబైలోని బాంద్రాలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై తోలినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.

ఇదిలా వుంటే వరుసగా హిట్స్ ఇస్తూ, వందల కోట్లు అవలీలగా సాధించగల హీరో జైలు పాలౌతాడని నిర్మాతలు గొల్లుమంటున్నారు. పన్నెండేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటనపై తీర్పు ఏ విధంగా వస్తుందోనని బాలీవుడ్ నిర్మాతలు గుబులుగా వున్నారు. ఏదేమైనా ఈ బ్రహ్మచారి కండల వీరుడి జీవితంలో ప్రశాంతతే లేకుండా పోయింది.