“ఆర్ఆర్ఆర్” లో యాక్షన్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయి!

Tuesday, May 25th, 2021, 03:45:39 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి సినిమా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అటు రామ్ చరణ్ ను మన్నెం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ ను గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో చూపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వీరిద్దరూ భారీ యాక్షన్ చిత్రం లో నటిస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని జక్కన్న చెక్కుతూ వస్తున్నారు. అయితే ఈ సినిమా కి సంబందించిన ఏ చిన్న విషయం అయిన సోషల్ మీడియా లో ఇట్టే వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రం లోని యాక్షన్ సన్నివేశాల గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా లో సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా, బాధాకరం గా ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని సన్నివేశాలను చూసేప్పుడు ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం లో క్లైమాక్స్ ఎంతో ప్రత్యేకం అంటూ మొదటి నుండి ప్రచారం లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల తో ఆ విషయాలు సైతం నిజమే అని తెలుస్తున్నాయి. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తుండగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్ లతో పాటుగా సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.