రివ్యూ రాజా తీన్‌మార్ : జయదేవ్ – దర్శకుడు పాతే.. కథ కూడా పాతే

Friday, June 30th, 2017, 07:57:26 PM IST


తెరపై కనిపించిన వారు: గంటా రవి, మాళవిక రాజ్

కెప్టెన్ ఆఫ్ ‘జయదేవ్’ : జయంత్ సి. పరాంజీ

మూల కథ :
ద్యూటీనే డ్యూటీని దైవంగా భావిస్తూ పనిచేసే సిన్సియర్ పోలీసాఫీసరైన జయదేవ్ (గంటా రవి) ఒక పోలీసాఫీసర్ యొక్క హత్య కేసును టేకప్ చేస్తాడు. ఆ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ హత్య వెనుక లిక్కర్ డాన్ (వినోద్ కుమార్) ఉన్నాడని తెలుసుకుంటాడు జయదేవ్. ఇక ఆ తర్వాత జయదేవ్ ఆ డాన్ ను ఎలా ఎదుర్కున్నాడు ? అతన్ని జైలుకి ఎలా పంపాడు ? అనేదే స్టోరీ.

విజిల్ పోడు :

–>స్టార్ హీరోల వారసులు కూడా మొదటి సినిమాకు ఇంత బరువైన పోలీస్ కథను చూజ్ చేసుకోరు. అలాంటిది గంటా రవి మాత్రం భయపడకుండా అలాంటి కథను ఎంచుకోవడం అభినందనీయం. బహుశా రాజకీయ నైపథ్యం గల కుటుంబం కావడంతో భాధ్యతగా ఆలోచించి కాస్త సొసైటీని ప్రతిబింబించేదిగా ఉంటుందని ఈ కథను చూజ్ చేసుకుని ఉండొచ్చు.

–> సినిమాలో ముఖం చూపించకుండా హీరో చేసే ఒక ఫైట్ సీన్ ను స్టైలిష్ గా రూపొందించారు.

–> అలాగే పోలీసుల సమస్యలను వివరించడం, హీరో ఇన్వెస్టిగేషన్ తాలూకు సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> కథ పాడే అయినా కనీసం కొత్త తరహా కథనంతో సినిమానౌ నిలబెట్టే ప్రయత్నం చేయాలి. కానీ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ అలాంటి ప్రయత్నం చేయలేదు. అయన తయారు చేసిన స్క్రీన్ ప్లే అస్సలు వర్కవుట్ కాలేదు. ఒకదశలో అన్ని హిట్ సినిమాల్ని తీసిన అనుభవం ఉన్న జయంత్ ఇలాంటి కథనం రాయడమేమిటి అనే అనుమానం కూడా వచ్చింది.

–> ఒకానొక దశలో హీరో ఉద్యోగం కోల్పోవడం, దాన్ని తిరిగి తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలు వంటివి బలహీనంగా ఉండటమే గాక సిల్లీగా కూడా ఉన్నాయి.

–> కొన్ని చోట్ల హీరోలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాల్ని పెట్టె అవకాశమున్నా అలాంటివి చేయకపోవడం నిరుత్సాహం కలిగించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ సినిమాలో మరీ వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: ఏంటి సార్.. కొత్త హీరోలు కూడా పాత కథల్నే పట్టుకుని వేలాడుతున్నారు.
మిస్టర్ బి : భలే వారే ! హీరో కొత్తగాని దర్శకుడు పాతే కదా.
మిస్టర్ ఏ : అవునండోయ్.. ఆ సంగతి మర్చేపోయాను.