ఏపీ కి మరో 1.43 కరోనా వాక్సిన్ డోసుల రాక!

Friday, May 7th, 2021, 08:56:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ వాక్సిన్ కొరత ఆంధ్ర ప్రదేశ్ ను సైతం వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 1.43 లక్షల కరోనా వైరస్ వాక్సిన్ డోస్ ల రానున్నాయి. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కి చెందిన 1.43 లక్షల టీకాలు నేడు చేరుకోనున్నాయి. అయితే కరోనా వైరస్ కి వాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నారు. దేశం లో పాజిటివ్ కేసులతో పాటుగా, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం తో ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.