నెక్లెస్ రోడ్ లో 10కె రన్

Sunday, November 30th, 2014, 11:03:55 AM IST


హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లో 10కె రన్ ప్రారంభం అయింది. ఈ రన్ ను భారత అధ్లేట్ మిల్కాసింగ్ ప్రారంభించారు. ఈ 10కె రన్ లో అనేక మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ 10కె రన్ ను నిర్వహించడం ఇది 12వ సారి అని నిర్వాహకులు స్పష్టం చేశారు. 10కె రన్ లో విజయం సాధించిన విజేతకు 30లక్షల రూపాయల భారీ ప్రైజ్ మనీ అందించనున్నారు. 10కె రన్ ను ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని మిల్కాసింగ్ తెలిపారు. 10కె రన్ కోసం తెలంగాణ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ 10కె రన్ సందర్భంగా నక్లెస్ రోడ్ చుట్టుప్రక్కల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.