సరదా కోసం దాన్ని నొక్కేసి అలా అయ్యాడు.!

Monday, January 4th, 2016, 11:43:25 AM IST


చిన్న వయసులో సరదా కోసం చేసే పనులు అప్పుడప్పుడు సరదాగా ఉన్నా.. ఒక్కోసారి ప్రాణాలమీదకు తీసుకొస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లరి చిల్లరిగా సరదాగా ఉండే ఓ బాలుడు.. చేసిన సరదా పని అతని ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లహామాలో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే..

ఒక్లహామాలోని ప్రయార్ కు చెందిన కోల్ పేటక్ అనే 14 సంవత్సరాల బాలుడు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తన ఫ్రెండ్స్ తో కలిసి.. ఇరుగు పొరుగు వారింటికి వెళ్లి డోర్ బెల్ గట్టిగా కొట్టి పరుగులు తీసేవాడు. అలా డోర్ బెల్ గట్టిగా కొట్టడం.. పరుగులు తీయడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. అలాగే ఓ ఇంటికి వెళ్ళిన కోల్ పేటక్ డోర్ బెల్ గట్టిగా కొట్టాడు. దీంతో ఆ ఇంటి యజమానికి కోపం వచ్చింది. ఎవరు ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నరనుకొని గన్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేయగానే పిల్లలు పారిపోవడం చూశాడు. వెంటనే వారిపై కాల్పులు జరపడంతో.. కోల్ అక్కడి కక్కడే కూలిపోయాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు. ప్రాణాపాయం ఏమి లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పిల్లావాడు చేసిన సరదా అల్లరి అతని ప్రణాల మీదకు తీసుకొచ్చింది.