14వ ఆర్ధిక సంఘంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ఉదయం సమావేశం అయ్యారు. తెలంగాణకు అవసరమైన నిధులను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆర్ధిక సంఘాన్ని అభ్యర్ధించారు. తెలంగాణ అవసరాలను పరిశీలిస్తామని, అవసరమైన నిధులను రాష్ట్రానికి ఇస్తామని ఆర్ధిక సంఘం హామీ ఇచ్చింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిగణలోకి తీసుకుంటామని, ప్రభుత్వం చేపడుతున్న పధకాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆర్ధిక సంఘం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చేపడుతున్న పధకాలు ప్రజల అవసరాలు తీరుస్తాయని ఆర్ధిక సంఘం పేర్కొంది.
సరిపోయేంత నిదులిస్తాం
Friday, September 19th, 2014, 07:08:35 PM IST