హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదం: 22మంది మృతి

Wednesday, September 24th, 2014, 05:12:19 PM IST


హిమాచల్ ప్రదేశ్ లోని బిలాన్ పూర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు ఒక బస్సు గోబింద్ సాగర్ రిజర్వాయర్ లో పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 22 మృతదేహాలను, 14మంది క్షతగాత్రులను వెలికి తీసినట్లు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ తెలిపారు. కాగా బస్సులో తొలుత 30మంది ప్రయాణికులు ఉన్నట్లు భావించినప్పటికీ ఇప్పుడు 36మంది ఉన్నట్లుగా తాజాగా సమాచారం తెలిసింది. ఇక సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.