త్వరలో 2500 నగరాలకు వైఫై సేవలు!

Friday, January 23rd, 2015, 12:37:41 PM IST


భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత మెరుగు పరిచేందుకు కేంద్రం నడుంబిగించింది. ఈ నేపధ్యంగా వచ్చే మూడేళ్ళలో దేశంలోని 2500 నగరాలు, పట్టణాలలో హై స్పీడ్ వై-ఫై సేవలను ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇక దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచి దాని ద్వారా డిజిటల్ ఇండియాను రూపొందించాలని మోడీ ప్రభుత్వం ప్రణాలికలను రూపొందిస్తోంది. ఇక ఈ నేపధ్యంగానే నగరాలలో వై-ఫై సేవల విస్తరణ చేపడుతున్నట్లు సమాచారం. కాగా ఈ వై-ఫై సేవలలో కొంత వరకు మాత్రమే ఉచితంగా సేవలు వినియోగించుకోవచ్చు, పరిమితి ముగిసిన అనంతరం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక దీని కోసం ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ద్వారా 7వేల కోట్లు ఖర్చు చెయ్యనుంది. కాగా ఈ వై-ఫై పధకంలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ శ్రీవాస్తవ తెలిపారు.