భయపెడుతున్న స్వైన్ ఫ్లూ

Thursday, December 18th, 2014, 09:43:02 PM IST


స్వైన్ ఫ్లూ వైరస్ నగరంలో మళ్ళీ పడగవిప్పుతున్నది. ఇప్పటికే ఈ ఫ్లూ దెబ్బకు ముగ్గురు మరణించారు. దీంతో నగరంలో ఆందోళన మొదలైంది. గతంలో ఈ స్వైన్ ఫ్లూ దెబ్బకు అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే… స్వైన్ ఫ్లూ ను ఎదుర్కొనేందుకు అన్నిరకాల మందులు, వెంటిలేటర్లు తమ వద్ద ఉన్నాయని గాంధి హాస్పిటల్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది ఇలా ఉంటే… బుధవారం గాంధీ ఆసుపత్రి వద్ద రోగులు ధర్నా చేశారు. స్వైన్ ఫ్లూ వార్డులు సరిగా లేవని…అరకొర వసతులతో రోగులు ఇబ్బందుకు పడుతున్నారని రోగులు అంటున్నారు. రాత్రిపూట పేషంట్లను ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదని వారు వాపోతున్నారు.