ఈజిప్టులో శవాల గుట్ట

Friday, January 15th, 2016, 01:14:02 PM IST


ఈజిప్ట్ లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. ఈజిప్ట్ లోని ఉత్తర సినాయ్ సరిహద్దులోని షేక్ జువైద్ చెక్ పోస్ట్ ను టార్గెట్ చేసుకుని మిలిటెంట్లు గురువారం రాత్రి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన మిలిటరీ బలగాలు ఎదురు కాల్పులు ప్రారంబించాయి. ఈ కాల్పుల్లో 30 మంది మిలిటెంట్లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 4 గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. దీంతో కాల్పుల ప్రాంతమంతా శవాల గుట్టగా మారింది.

అబు రాఫెయ్ అంతర్జాతీయ తీరం షేక్ జువైద్ నగరం గుండా వెళుతుండటం వల్ల, అన్ని విధాలా మిలిటెంట్ కార్యకలాపాలకు అనుకూలంగా ఉండటం వల్ల మిలిటెంట్లు ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలని దాడికి తెగబడ్డారు. కొన్నేళ్లుగా ఈజిప్ట్ లో మిలిటెంట్లు సాగిస్తున్న పభుత్వ వ్యతిరేక కార్యకలాపాల వల్ల అనేకసార్లు ఇలాంటి ఘతానలే చోటు చేసుకున్నాయి. దీని వల్ల అనేకమంది ఆర్మీ, పోలీస్ సిబ్బంది మరణించారు.