నిమిషంలో 37జోకులు పేల్చాడు..!

Monday, February 2nd, 2015, 06:00:47 PM IST


నిమిషంలో 37 జోకులు… అర్ధం కాలేదని బుర్ర బద్దలు కొట్టుకోకండి. విషయం ఏమిటంటే… విశాఖపట్నానికి చెందిన కోరుకొండ రంగారావు అనే వ్యక్తీ ఒక నిమిషంలో 37 జోకులు చెప్పి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, పదిగంటల పాటు ఏకధాటిగా బహుపాత్రాభినయాలతో 40 వైవిధ్యమైన పాత్రలు అభినయించి ఆహుతులను ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమం విశాఖ లాఫర్స్ ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. లిమ్కా బుక్ అఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్, ఆసియా బుక్ అఫ్ రికార్డ్ తదితర వాటిల్లో స్థానం సంపాదించేందుకు ఈ రకమైన ప్రదర్శన ఇచ్చినట్టు కోరుకొండ రంగారావు ప్రదర్శన అనంతరం తెలియజేశారు.