ఏపీలో మరో విషాదం.. ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి..!

Wednesday, May 5th, 2021, 03:00:47 AM IST

ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ పక్క కరోనా కేసులు పెరిగిపోతుండడం, మరో పక్క ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్కపోవడం, ఆక్సిజన్ కొరత వంటి అంశాలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే తాజాగా ఆక్సిజన్ అందక కరోనా రోగులు 5 మంది మృతి చెందారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన కలెక్టర్ మిగిలిన రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని, ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆదేశించారు.